సౌదీలో దుర్భర జీవితాన్ని గడుపుతున్న వ్యక్తికి నారా లోకేశ్ హామీ

  • నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయిన వీరేంద్ర కుమార్
  • సౌదీ ఎడారిలో ఒంటెల మధ్య పడేశారని ఆవేదన
  • స్వస్థలానికి తీసుకొచ్చే బాధ్యతను తాను తీసుకుంటానన్న లోకేశ్
బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ నానా కష్టాలు పడుతున్న తెలుగువారు ఎందరో ఉన్నారు. అక్కడ పడుతున్న కష్టాలను తెలియజేస్తూ పలువురు సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు. తాజాగా సౌదీఅరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర అనే వ్యక్తి వీడియో చూసి ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. 

నకిలో ఏజెంట్ చేతిలో తాను మోసపోయి దుర్భర జీవితాన్ని గడుపుతున్నానని వీరేంద్ర కుమార్ ఎక్స్ వేదికగా వీడియో పోస్ట్ చేశాడు. ఖతార్ లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి... తనను మోసం చేసి సౌదీలోని ఎడారిలో ఒంటెల మధ్య తనను పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యంతో తాను బాధపడుతున్నానని, ఇక్కడ బతకలేకపోతున్నానని చెప్పాడు. వీరేంద్ర వీడియో చూసి నారా లోకేశ్ స్పందించారు. ధైర్యంగా ఉండాలని, స్వస్థలానికి తీసుకొచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.


More Telugu News