చంద్రబాబుపై బహిరంగ విమర్శలు.. పోలీసు అధికారుల సంఘం క్షమాపణలు

  • టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్యతో పోలీసు సంఘం ప్రతినిధుల సమావేశం
  • పైఅధికారుల వల్లే అలా చేయాల్సి వచ్చిందని వివరణ
  • ఎవరు అధికారంలో ఉంటే వారి విధానాలు అమలు చేస్తామని వ్యాఖ్య
గత ప్రభుత్వంలో చంద్రబాబుపై బహిరంగ విమర్శలు చేసిన పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యను కలిసి క్షమాపణ కోరారు. అప్పట్లో జరిగిన పరిణామాలను మనసులో పెట్టుకోవద్దని బతిమలాడారు. పై అధికారుల ఒత్తిడి వల్ల అలా అనాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అనంతరం, ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. 

‘వర్ల రామయ్యను కలిసి పోలీసు బైలాస్‌లో ఉన్న కొన్ని నిబంధనలను తొలగించాలని కోరాం. పోలీసు వ్యవస్థ మనోభావాలు దెబ్బతీసేలా ఎవరైనా మాట్లాడితే దానికి కౌంటర్ ఇవ్వడమే కానీ వ్యక్తిగతంగా ఎవరిపైనా కక్ష లేదు. నాడు చంద్రబాబుపై విమర్శలు చేసినప్పుడూ ఒక పోలీసు అధికారిగా అలా చేయకూడదని నాకు అనిపించింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు పోలీసు వ్యవస్థను నిందించినప్పుడు కూడా ఖండించాం. ప్రభుత్వ ఉద్యోగిగా ఎవరు అధికారంలో ఉంటే వారి విధానాలను అమలు చేయాల్సి వస్తుంది. మాకంటూ ప్రత్యేక అధికారాలేమీ ఉండవు. ఒకప్పుడు ఆంధ్ర పోలీసులు పనికిరారని తెలంగాణ పోలీసుల్ని ఆశ్రయించిన వైసీపీ అధినేత జగన్.. అదే ఆంధ్ర పోలీసులతోనే గత ఐదేళ్లు పాలించారు. ఇప్పుడు మళ్లీ పోలీసుల్ని తప్పుబట్టడం సరికాదు. జగన్ వ్యాఖ్యాల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.


More Telugu News