స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. చంద్రబాబు బెయిలు రద్దు పిటిషన్ విచారణ వాయిదా

  • స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో గతేడాది నవంబర్‌లో చంద్రబాబుకు బెయిల్
  • రద్దు చేయాలని కోరుతూ అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్
  • నిన్న 35 కేసులు విచారించి మిగతా కేసులను వాయిదా వేసిన ధర్మాసనం
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బెయిల్ పిటిషన్ రద్దుచేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో గతేడాది నవంబరులో చంద్రబాబుకు హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. దీనిని రద్దు చేయాలంటూ అప్పటి ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. 

అత్యవసర పని ఉందంటూ తన ముందున్న కేసులను జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ సతీశ్‌చంద్రతో కూడిన ధర్మాసనం విచారణను త్వరగా ముగించింది. దీంతో చంద్రబాబు బెయిలు రద్దు పిటిషన్ విచారణకు రాలేదు. నిన్న మొత్తం 62 కేసులు లిస్టయ్యాయి. వీటిలో చంద్రబాబు బెయిలు రద్దు పిటిషన్ 49వది. 35 కేసులను విచారించిన తర్వాత మధ్యాహ్నం 12.20 గంటలకు అత్యవసర పని ఉందని, మిగతా కేసుల విచారణను వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ బేలా త్రివేది ప్రకటించారు. రెండుమూడు వారాల తర్వాత వాటిని తిరిగి విచారణకు తీసుకుంటామని తెలిపారు.


More Telugu News