నీతి ఆయోగ్ బృందంతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం
- చంద్రబాబును కలిసిన నీతి ఆయోగ్ బృందం
- వికసిత ఆంధ్రప్రదేశ్ ముసాయిదా సమర్పణ
- నీతి ఆయోగ్ సహకారంతో విజన్-2047 కోసం కృషి చేస్తామన్న చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నేడు నీతి ఆయోగ్ బృందంతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. విజన్ డాక్యుమెంట్ 2047, వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ పై చర్చించామని తెలిపారు.
"ఇవాళ నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని బృందాన్ని కలిశాను. వారు వికసిత ఆంధ్రప్రదేశ్-2024 ముసాయిదాను సమర్పించారు. నీతి ఆయోగ్ సహకారంతో దారిద్ర్య రహిత వికసిత ఆంధ్రప్రదేశ్-2047 దిశగా కృషి చేస్తున్నాం.
15 శాతం వార్షిక వృద్ధి రేటుతో పాటు, తలసరి ఆదాయాన్ని ప్రతి నాలుగేళ్లకు రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకుని, క్షేత్రస్థాయిలో ఆ నిర్ణయాలు పక్కాగా అమలయ్యే విధానం అవలంబిస్తాం.
దాంతోపాటే... జనాభా నిర్వహణ, పునరుత్పాదక శక్తి, నైపుణ్యాభివృద్ధి, దారిద్ర్య నిర్మూలన, పోర్టుల అభివృద్ధి, ఉత్పాదక క్లస్టర్లు, గ్రోత్ హబ్ లు, ఏఐ హబ్ ల స్థాపనకు ప్రాధాన్యత ఇస్తాం" అని చంద్రబాబు వివరించారు.