హైడ్రా విధివిధానాలను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం

  • జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ వరకు హైడ్రాకు అధికార పరిమితి పరిధి అప్పగింత
  • హైడ్రా చైర్మన్‌గా వ్యవహరించనున్న ముఖ్యమంత్రి
  • సభ్యులుగా మంత్రులు, సీఎస్, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, మేయర్
హైదరాబాద్ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ (హైడ్రా) విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ వరకు హైడ్రాకు అధికార పరిమితి పరిధిని అప్పగించింది. హైడ్రా చైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మంత్రులు, సీఎస్, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ మేయర్ సభ్యులుగా ఉంటారు.


More Telugu News