సమస్యను పరిష్కరించాం... ఇలా చేయండి!: మైక్రోసాఫ్ట్

  • విండోస్ సర్వీసుల్లో తలెత్తిన అంతరాయాన్ని పరిష్కరించినట్లు వెల్లడి
  • ఇది సైబర్ సెక్యూరిటీ దాడి కాదని స్పష్టీకరణ
  • క్రౌడ్ స్ట్రయిక్ సంస్థ ఇచ్చిన అప్ డేట్ కారణంగా ఎర్రర్ వచ్చినట్లు వెల్లడి
విండోస్‌లో బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్యను పరిష్కరించినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. విండోస్ సర్వీసుల్లో తలెత్తిన అంతరాయాన్ని పరిష్కరించామని ఐటీ దిగ్గజం ప్రతినిధులు తెలిపారు. బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్య సైబర్ సెక్యూరిటీ దాడి కాదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.

క్రౌడ్ స్ట్రయిక్ సంస్థ ఇచ్చిన కొత్త అప్ డేట్ కారణంగా బ్లూ స్క్రీన్‌పై ఎర్రర్ వచ్చినట్లు తెలిపింది. క్రౌడ్ స్ట్రయిక్ అనేది ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ అని వెల్లడించింది. సమస్యను ఎలా పరిష్కరించాలో కూడా తెలిపింది. క్రౌడ్ స్ట్రైక్ డైరెక్టరీలో సీ-సీ0000291*.sys ఫైల్‌ను తొలగించాలని సూచించింది. సేఫ్ లేదా రికవరీ మోడ్‌లో ఓపెన్ చేయాలని పేర్కొంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే అలాంటి వారి కోసం అప్ డేట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది.


More Telugu News