చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి
- రైతుల సమస్యలను చిరంజీవి పట్టించుకోవడం లేదన్న జగ్గారెడ్డి
- మోదీ, పవన్ కు మాత్రమే మద్దతిస్తున్నారని విమర్శ
- రాహుల్ కు ఎందుకు సపోర్ట్ చేయడం లేదని ప్రశ్న
మెగాస్టార్ చిరంజీవిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు జరుగుతున్న నష్టాలపై సినిమాలు తీసిన చిరంజీవి... ఢిల్లీలో ధర్నాలు చేసిన రైతులకు ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. సినిమాలతో కోట్లు సంపాదిస్తున్న మీరు రైతు సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగారు. రైతుల పేరుతో తీసిన సినిమాలతో డబ్బులు సంపాదిస్తూ... ప్రధాని మోదీకి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. మోదీకి, పవన్ కు మాత్రమే ఎందుకు మద్దతిస్తున్నారని... రైతులకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీకి ఎందుకు సపోర్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే చిరంజీవి సక్రమ మార్గంలో ఉండేవారని... ఇప్పుడు పక్కదారి పట్టారని అన్నారు.
కేసీఆర్ గత పదేళ్లలో రూ. 7 లక్షల కోట్లు అప్పు చేసి రైతులకు కేవలం రూ. 26 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని... తమ కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లోనే రూ. 31 వేల కోట్లు ఇచ్చిందని జగ్గారెడ్డి చెప్పారు. ఇప్పటిదాకా బీజేపీ ఎన్ని వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిందని ప్రశ్నించారు. కేటీఆర్ ట్విట్టర్ కే పనికొస్తాడని... పనికి పనికిరాడని విమర్శించారు.