జగన్ కు భద్రత తగ్గించారన్న ప్రచారంలో నిజం లేదు: ఏపీ ప్రభుత్వం వివరణ

  • వినుకొండ  పర్యటనకు బయల్దేరిన జగన్
  • రిపేర్ లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారన్న వైసీపీ
  • ఆ వాహనం పలుమార్లు మొరాయించిందని వెల్లడి
  • జగన్ ఆ వాహనం దిగి మరో వాహనంలో వెళ్లారని వివరణ
  • వైసీపీ ఆరోపణలను ఖండించిన ఏపీ ప్రభుత్వం
మాజీ సీఎం జగన్ భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని, వినుకొండ పర్యటన నేపథ్యంలో గత అర్ధరాత్రి నుంచి ఆయనకు భద్రత తగ్గించిందని వైసీపీ ఆరోపిస్తోంది. జగన్ కు రిపేర్ లో ఉన్న పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించడంతో, వినుకొండ వెళ్లే క్రమంలో పలుమార్లు ఆ వాహనం మొరాయించిందని, దాంతో జగన్ ఆ వాహనం దిగి మరో వాహనంలో వినుకొండ వెళ్లాల్సి వచ్చిందని వివరించింది. 

దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. జగన్ కు భద్రత తగ్గించారనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. కండిషన్ లో లేని వాహనాలు ఇచ్చారన్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. జగన్ కు కేటాయించిన జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఎలాంటి లోపం లేదని ఉద్ఘాటించింది. 

జగన్ కు కేటాయించిన వాహనం పూర్తి ఫిట్ నెస్ తోనే ఉందని అధికారులు వెల్లడించారు. జగన్ దిగిన తర్వాత ఆ వాహనం కాన్వాయ్ లోనే వెళ్లిందని వివరించారు. ఇక, జగన్ కాన్వాయ్ వెంట వచ్చిన వాహనాలను నిలిపివేశామనడం సరికాదని ప్రభుత్వం పేర్కొంది.


More Telugu News