భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సూచీలు
  • 738 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 269 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు, మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం తదితర కారణాలతో సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ ఒక్క రోజే ఏకంగా రూ. 8 లక్షల కోట్ల సంపద ఆవిరయింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 738 పాయింట్లు కోల్పోయి 80,604కి దిగజారింది. నిఫ్టీ 269 పాయింట్లు నష్టపోయి 24,530 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (1.92%), ఐటీసీ (0.89%), ఏసియన్ పెయింట్ (0.53%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.03%). 

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-5.17%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-4.36%), ఎన్టీపీసీ (-3.51%), టాటా మోటార్స్ (-3.43%), అల్ట్రాటెక్ సిమెంట్ (-3.28%).



More Telugu News