కాలినడకన తిరుమల చేరుకున్న ఏపీ హోంమంత్రి అనిత

  • మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్న అనిత
  • స్వామివారికి మొక్కుల చెల్లింపు
  • తిరుమల మెట్ల మార్గంలో అభివృద్ధి పనులు చేయాల్సి ఉందని వెల్లడి
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మెట్లమార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకున్నారు. అనంతరం వెంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తిరుమల మెట్ల మార్గంలో అభివృద్ధి పనులు చేయాల్సి ఉందని తెలిపారు. నడక మార్గంలో భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు జారీ చేయడంలేదని, తిరిగి టోకెన్లను పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. 

అంతకుముందు, హోంమంత్రి అనితకు తిరుపతిలో పద్మావతి అతిథి గృహం వద్ద పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. 


More Telugu News