అమెరికాలో బాగా సంపాదిస్తున్నది భారత సంతతి వాళ్లే... మస్క్ ఆసక్తికర ట్వీట్
- అమెరికా దేశం అవకాశాలకు నెలవు అని అభివర్ణించిన మస్క్
- అమెరికాలో విదేశీ సంతతి ప్రజల ఆదాయ పట్టికను పంచుకున్న వైనం
- కోటి రూపాయల కుటుంబ ఆదాయంతో భారత్ టాప్
ప్రపంచ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ ఆసక్తికర ట్వీట్ చేశారు. నిజంగా అమెరికా అవకాశాలకు నెలవు అని అభివర్ణించారు. ఈ మేరకు అమెరికాలో అత్యధికంగా సంపాదిస్తున్న విదేశీ సంతతి ప్రజల జాబితాను పంచుకున్నారు. అందులో భారత సంతతి ప్రజలే నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు.
2018 నాటి ఆ డేటా ప్రకారం... అమెరికాలో భారత సంతతి ప్రజల కుటుంబ ఆదాయం రూ.1 కోటి అని వెల్లడించారు.
టాప్-5లో భారత్ తర్వాత స్థానాల్లో తైవాన్ సంతతి ప్రజలు (రూ.80 లక్షలు), చైనా సంతతి ప్రజలు (రూ.68 లక్షలు), జపాన్ సంతతి ప్రజలు (రూ.66 లక్షలు), పాకిస్థాన్ సంతతి ప్రజలు (రూ.64 లక్షలు) ఉన్నారు.
ఇక, శ్వేతజాతి అమెరికన్ల కుటుంబ ఆదాయం రూ.55 లక్షలు కాగా... రూ.56 లక్షల ఆదాయంతో వియత్నాం సంతతి ప్రజలు అమెరికన్ల కంటే ఒక మెట్టు పైన ఉన్నారు.