అల్పపీడన ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు... సీఎం చంద్రబాబు సమీక్ష

  • బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు... వరద పరిస్థితులు
  • పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
  • ముందస్తు ప్రణాళికతో పనిచేసి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశాలు
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబు నేడు అధికారులతో ఆన్ లైన్ లో సమీక్ష చేపట్టారు. 

వర్షాలు అధికంగా ఉన్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అల్పపీడన ప్రభావం మరికొన్ని రోజులు ఉండే అవకాశం ఉన్నందున, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

ముందస్తు ప్రణాళికతో పనిచేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, పరిస్థితులను అంచనా వేసి, అప్రమత్తంగా వ్యవహరిస్తే నష్టాలను నివారించగలుగుతామని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.


More Telugu News