నరసాపురం ఎంపీడీవో కుటుంబ సభ్యులకు మంత్రి నిమ్మల పరామర్శ

  • గత కొన్నిరోజులుగా అదృశ్యమైన ఎంపీడీవో వెంకటరమణ రావు
  • శుక్రవారం కానూరులోని ఆయన నివాసానికి వెళ్లిన మంత్రి
  • ఆచూకీ కోసం పోలీసులు చేపట్టిన చర్యల వివరాలపై ఆరా
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో కనిపించకుండా పోవడంపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. శుక్రవారం ఎంపీడీవో కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. నరసాపురం ఎంపీడీవో మండల వెంకటరమణ రావు గత కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుటుంబం తీవ్ర విచారంలో మునిగింది.

ఈ క్రమంలో పెనమలూరు మండలం కానూరులోని ఎంపీడీవో నివాసానికి మంత్రి నిమ్మల శుక్రవారం ఉదయం వెళ్లారు. వెంకటరమణ రావు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన కనిపించకుండా పోవడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా, వెంకటరమణ రావు ఆచూకీ కోసం తీసుకున్న చర్యలపై పోలీసులను ఆరా తీశారు. కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లకు మంత్రి నిమ్మల రామానాయడు ఫోన్ చేశారు. కేసు దర్యాఫ్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏలూరు కాలువలో గాలిస్తున్నామని, ఇందులో భాగంగా డ్రోన్ ద్వారా కాలువ వెంట శోధిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఏలూరు కాలువలో దట్టంగా ఉన్న గుర్రపు డెక్కను తొలగించేందుకు అనుభవజ్ఞులైన లస్కర్లను పిలిపించాలని మంత్రి వారికి సూచించారు. గాలింపు చర్యల్లో వేగం పెంచాలని అధికార యంత్రాంగానికి మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు.


More Telugu News