పోటెత్తుతున్న వరద.. నిండుకుండలా హుస్సేన్ సాగర్

  • హుస్సేన్ సాగర్ పూర్తి నీటిమట్టం 514 అడుగులు
  • ప్రస్తుత నీటిమట్టం 513.21 అడుగులు
  • మరో మూడు రోజులు తెలంగాణకు భారీ వర్ష సూచన
భారీగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతోంది. వరద నీటితో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. సాగర్ పూర్తి నీటిమట్టం 514 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 513.21 అడుగులుగా ఉంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సాగర్ లోకి చేరుతున్న వరదనీటిని కిందికి వదిలేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మూసీ నది పరీవాహక ప్రాంతంలో ఉన్న జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. 

మరోవైపు భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లోని చెరువులు, కుంటలు నిండిపోయాయి. వాగులు వరద నీటితో పోటెత్తుతున్నాయి. రానున్న మూడు రోజులు కూడా తెలంగాణలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.


More Telugu News