యాదాద్రిని దర్శించుకున్న సీనియర్ నటుడు తనికెళ్ల భరణి.. అపురూప కానుక అందించిన యాదాద్రి పండితులు
- భార్య దుర్గాభవాని జన్మదినం సందర్భంగా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న తనికెళ్ల భరణి
- పురాణపండ రచనా సంకలనాలు అందించిన వేదపండితులు
- శ్రీనివాస్ దైవీయ స్పృహ, నిస్వార్థసేవ తనకు తెలుసన్న భరణి
ప్రముఖ సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి నిన్న కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భరణి దంపతులకు ఆలయ వేదపండితులు ఆశీర్వచనం చేసి మంత్రనయ జ్ఞాపికలుగా ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ రచించిన గ్రంథాలను అందించారు.
ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. తన భార్య దుర్గాభవాని జన్మదినం సందర్భంగా స్వామి దర్శనానికి వచ్చినట్టు తెలిపారు. స్వామి దర్శనం, అనుగ్రహం పుష్కలంగా లభించాయని పేర్కొన్నారు. హృదయాన్ని కరిగించే భక్తినీ, అనితర సాధ్యమైన కవితా రీతిని మేళవించి ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ చేస్తున్న రచనా సంకలన గ్రంథవైభవం, ధార్మిక చైతన్యం అనితర సాధ్యమని ప్రశంసించారు. శ్రీనివాస్ దైవీయ స్పృహ, నిస్వార్థసేవ తనకు తెలుసనని కొనియాడారు.
‘జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం సంస్థ ప్రచురించిన పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనాలను లక్షలాదిమంది భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తుండడంపై యాదాద్రి శ్రీనివాస్ శర్మ సహా పండిత వర్గాలు అభినందనలు తెలిపాయి. కాగా, పురాణపండ గ్రంథాలను బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంతోపాటు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలోనూ వీటిని భక్తులకు పంపిణీ చేస్తున్నారు.