రాజీనామా అడగం... ఎందుకంటే మీరెలాగు పారిపోతారు: హరీశ్‌రావుపై రేవంత్ రెడ్డి
- రూ.1 లక్ష లోపు రుణమాఫీని లాంఛనంగా ప్రారంభించిన సీఎం
- మీలాంటి బూటకపు మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదని వ్యాఖ్య
- 11.50 లక్షల రైతుల ఖాతాల్లో నిధుల జమ
'రైతులకు రుణమాఫీ చేశామని, అయినా మేం రాజీనామా చేయమని అడగడం లేదు. ఎందుకంటే మీరు ఎలాగూ పారిపోతారని మాకు తెలుసు' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును ఉద్దేశించి అన్నారు. రూ.1 లక్ష లోపు రైతు రుణాల మాఫీని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... మీలాంటి బూటకపు మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదని... ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామన్నారు.
11.50 లక్షల రైతుల ఖాతాల్లోకి నిధులు
ఈరోజు రుణమాఫీ నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేసింది. రూ.1 లక్ష వరకు రుణం ఉన్న వారికి నిధులు జమ చేసింది. రైతు ఖాతాల్లోకి రూ.7 వేల కోట్లు జమ చేసింది. ఈ నెలాఖరు లోపు లక్షన్నర రూపాయల వరకు రుణమాఫీ చేయనుంది. ఆగస్ట్ దాటకముందే రూ.2 లక్షల వరకు ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది.