అరుంధతి సినిమాలో పశుపతి మాదిరిగా వైసీపీ భూతానికి చంద్రబాబు సమాధి కట్టారు: మహాసేన రాజేశ్

  • అరుంధతి సినిమాలో పశుపతిలా సమాధి నుంచి వైసీపీ ఫేక్ ప్రచారాలు చేస్తోందని వంగ్యాస్త్రాలు
  • కూటమి ప్రభుత్వాన్ని ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపాటు
  • హత్యలు, అరాచకాలంటూ అబద్దాలు ఆడుతున్నారని ఆగ్రహం
  • వైసీపీ నేతలే విషం పెట్టి... కూటమిపై నెట్టేస్తారని వ్యాఖ్య
  • గత ఐదేళ్లలో వైసీపీ  అరాచకాలకు, హత్యలకు అడ్డు అదుపు లేదన్న రాజేశ్ 
వైసీపీ పుట్టింది, బ్రతుకుతుంది తప్పుడు ప్రచారంలో అని, వైసీపీని చంద్రబాబు సమాధి చేశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్ విమర్శించారు. ప్రేతాత్మగా మారిన వైసీపీ ఆ సమాధి నుంచి ఫేక్ ప్రచారం మొదలు పెట్టిందని అన్నారు. అరుంధతి సినిమాలో పశుపతి అరాచకాలను తట్టుకోలేక అతన్ని బత్రికి ఉండగానే సమాధి చేశారని, అంతకంటే ఘోరమైన వైసీపీని ప్రజల సహకారంతో చంద్రబాబు సమాధి చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అరుంధతి సినిమాలో ప్రేతాత్మగా మారిన పశుపతి సమాధి నుంచి బయటకు రావడానికి ప్రయత్నించినట్లే నేడు వైసీపీ కూడా ఆ సమాధి నుంచి బయటకు రావడానికి దుష్ప్రచారాలను మొదలు పెట్టిందని విమర్శనాస్త్రాలు సంధించారు. హత్యాచారాలు, దారుణాలు జరిగిపోతున్నాయంటూ గగ్గోలు పెడుతున్నారని, చంద్రబాబు అధికారం చేపట్టాక రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారని రాజేశ్ అన్నారు. వైసీపీ పాలనలో ఫోన్ మాట్లాడుకోవాలన్నా భయపడే పరిస్థితి ఉండేదని అన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

వైసీపీ పెంచి పోషించిన గంజాయి, దిగుమతి చేసిన డ్రగ్స్‌తోనే రాష్ట్రంలో విచ్చల విడిగా నేరాలు జరుగుతున్నాయని రాజేశ్ మహాసేన అన్నారు. నేరాలకు వైసీపీనే పునాది వేసిందని, కమీషన్ల కోసం కక్కుర్తి పడి అందించిన ట్యాబ్‌లలో నీలి చిత్రాలను చూస్తూ బడులకు వెళ్లే మైనర్లు కూడా మానభంగాలు చేస్తున్నారని విమర్శించారు. మళ్లీ సిగ్గులేకుండా రాష్ట్రంలో ఏమూలన ఏ నేరం జరిగినా దాన్ని టీడీపీకి అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతీకారం తీర్చుకుంటామంటే చంద్రబాబు చెప్పిన మాట ఇదీ
రాష్ట్రంలో ఇప్పుడు క్షణికావేశంలో ఎక్కడ నేరాలు జరుగుతున్నా ఆ నేరాలను చంద్రబాబు ప్రభుత్వానికి రుద్దుతున్నారని వైసీపీపై రాజేశ్ మండిపడ్డారు. ‘‘చంద్రబాబు శాంత స్వాభావి. ఆయన దాడులు చేయమని చెప్పరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము దాడులకు గురవుతున్నప్పుడు అధికారంలోకి వస్తే మాకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని మేము అంటే చంద్రబాబు మాకు ఒక మాట చెప్పారు. కాలువలో కొట్టుకుపోతున్న తేలును కాపాడబోయిన స్వామిని అది పదే పదే  కుడుతున్నా... ఆయన దాన్ని కాపాడారు. కుట్టడం తేలు నైజం, కాపాడటం మనిషిగా మన నైజం. దాని పని అది చేసింది. మన పని మనం కరెక్ట్‌గా చేయాలి అని మా నాయకుడు చెప్పారు. వైసీపీ వాళ్లు నేరస్తులు వాళ్లు నేరస్తులు కాబట్టి నేరాలే చేస్తారు. కానీ టీడీపీ పార్టీలో అందరూ నాయకులు ఉన్నారు. నాయకులు ఎప్పుడూ.. ఎన్ని దాడులైనా తట్టుకుని ప్రజలకోసం పనిచేస్తారు తప్పా తిరిగి దాడి చేయరు. 

భవిష్యత్‌పై యువతకు ఆశలు చిగురించాయి
కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఉన్న యువతకు భవిష్యత్‌పై కొత్త ఆశలు చిగురించాయని రాజేశ్ మహాసేన అన్నారు. ‘‘ఒకవైపు పోలవరం నిర్మాణం, మరోవైపు రాజధాని నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం లేదు. దానికి మైన్స్ కూడా కేటాయిస్తామని కేంద్ర మంత్రులే వచ్చి స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధివైపు అడుగులు వేస్తుంటే ఈ అభివృద్ధిని నాశనం చేయాలని ఆ సమాధిలో ఉన్న వైసీపీ భూతం మళ్లీ తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. నాడు కోడికత్తి డ్రామాకు తెరతీసి అది చంద్రబాబు చేయించారని అబద్దాలు ప్రచారం చేశారు. అలాగే సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపి చంద్రబాబుకు అంటగట్టిన అబద్దాల కోరులు ఈ వైసీపీ నేతలు. ఈ అబద్దాలకోరులను 11 సీట్లకు పరిమితం చేసి ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా వారికి బుద్ధి రావడంలేదు. యాక్సిడెంట్‌లో డిడైవర్‌కు ఢీ కొట్టి చనిపోయినా అది టీడీపీ చేసిన హత్యే అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా కుటుంబ కలహాలతో ఉరి వేసుకున్నా దాన్ని కూడా టీడీపీకే రుద్దుతున్నారు. ఈ తప్పుడు ప్రచారాలను చూస్తుంటేనే సిగ్గుగా ఉంది’’అని రాజేశ్ అన్నారు. 

విద్యార్థుల బకాయిల సమస్యను లోకేశ్ పరిష్కరించారు
రూ.3000 కోట్ల ఫీజు బకాయిలు కట్టకుండా విద్యార్థులను వైసీపీ ఇబ్బంది పెడితే నారా లోకేశ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆ సమస్యను పరిష్కరించారని రాజేశ్ మహాసేన అన్నారు. ‘‘ దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక జీవోను తీసుకువచ్చి వారికి న్యాయం చేసిన గొప్ప వ్యక్తి నారా లోకేశ్. 25 మందికోసం కూడా ప్రభుత్వం దిగి వస్తుందని కూటమి ప్రభుత్వం నిరూపించింది. ఈ రాష్ట్రంలో ఉన్న పౌరులందరి శ్రేయస్సు కోసం పాటు పడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. కువైట్‌లో ఒక్క వ్యక్తి బాధ పడుతుంటే చలించిపోయిన వ్యక్తి లోకేశ్. అతడిని ఇంటికి చేర్చేందుకు కృషిచేశారు. కేవలం 25 కుటుంబాలే కాదు ఒక్క వ్యక్తి అయినా ఒక్క కుటుంబమైన ఈ ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో ఈ ఘటనతో అర్థం చేసుకోవచ్చు. ఎన్సీఆర్బీ రిపోర్ట్  ప్రకారం ప్రతి గంటకు దేశంలో మూడు హత్యలు జరుగుతున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు.

దుష్ప్రచారం చేస్తున్నారు
వాళ్లు ఘోరమైన నేరాలు చేశారు కాబ్టే నేడు వైసీపీ నేతలు 11 సీట్లకు పరిమితం అయ్యారని, నాడు తమ నాయకుడిని చంపేద్దామనుకున్నారని, దాడులు చేశారని రాజేశ్ పేర్కొన్నారు. ‘‘తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. నారా లోకేశ్ మీద రాళ్లతో దాడులు చేయించి ఆయన్ను చంపాలని చూశారు. టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేశారు. తల్లిలాంటి భువనేశ్వరమ్మ మీద ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలు దారుణమైన నేరస్తులు.. జగన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, అనంతబాబు, అంబటి, గోరంట్ల లాంటి నేతలు హత్యలు, అమ్మాయిలతో అసభ్య ప్రవర్తలకు పాల్పడ్డారు. ఘోరమైన నేరాలు చేశారు. మళ్లీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తుంటే నేరాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని ఆరోపిస్తున్నారు. టీడీపీని క్విట్ చేయాలని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని రాజేశ్ పేర్కొన్నారు. 

తమ నాయకులు చంద్రబాబు, లోకేశ్‌లు నిరంతరం అభివృద్ధి వైపే పయనం సాగిస్తున్నారని, ఎక్కడా కూడా కక్షసాధింపు చర్యలు ప్రతీకార దాడులకు  ప్రోత్సహించడం లేదని ఆయన చెప్పారు. ‘‘అలా ప్రోత్సహించే మాట అయితే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన ఏ ఒక్కడు ఈ రోజు ప్రాణాలతో ఉండేవాడు కాదు. తల్లి లాంటి మా భువనేశ్వరమ్మని అవమానించిన వాడు ఎవ్వడూ నేడు ఊపిరి పీల్చేవాడు కాదు. కానీ మా నాయకుడు మాకు క్రమశిక్షణ నేర్పించారు. నాయకులు అంటే ఒక దెబ్బ పడైనా ప్రజలవైపు నిలబడాలి. కానీ తిరిగి దాడులు చేయకూడదని నేర్పించారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చాక కూడా 8 మంది టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు హత్య చేశారు. దాన్ని తప్పుదోవ పట్టించడానికి, విజయసాయిరెడ్డిపై వస్తున్న అక్రమ సంబంధాల ఆరోపణల టాపిక్‌ను డైవర్ట్ చేయడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరుతున్నా’’ అని రాజేశ్ మహాసేన పేర్కొన్నారు.


More Telugu News