నాడు సీఐడీ కార్యాలయంలో నన్ను చంపేందుకు కుట్రపన్నారు: రఘురామకృష్ణరాజు

  • జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే
  • తన ఫిర్యాదుతో పలువురిపై కేసు నమోదైందని వెల్లడి
  • తనపై కుట్ర చేసిన సీఐడీ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్
వైసీపీ హయాంలో గుంటూరు సీఐడీ కార్యాలయంలో తనను చంపేందుకు కుట్ర పన్నారని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. కానీ మీడియా వల్లనే నాడు బతికిపోయానన్నారు. గురువారం ఆయన జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తన ఫిర్యాదు మేరకు సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్, విజయ్ పాల్, మాజీ సీఎం జగన్, జీజీహెచ్ ప్రభావతి మీద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలు, పురోగతి తెలుసుకోవడానికి తాను వచ్చానన్నారు. తన దగ్గర ఉన్న సమాచారం అందించడానికి వచ్చానన్నారు. కేసు నమోదైందని... తనపై కుట్ర చేసిన సీఐడీ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో తాను సీఐడీ కార్యాలయానికి వచ్చినప్పుడు... అధికారులు బయటకు వెళ్లగానే ఐదుగురు వచ్చి కొట్టారని తెలిపారు. తనను చిత్రహింసలకు గురి చేసి ఏమీ తెలియనట్లు నటించారన్నారు.


More Telugu News