ఏం సాధించారని కాంగ్రెస్ సంబరాలు జరుపుకుంటోంది?: బండి సంజయ్
- రబీ, ఖరీఫ్‌లో చెల్లించాల్సిన రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టినందుకా? అని ప్రశ్న
- రుణమాఫీలో కోత పెట్టి రైతులను మోసం చేసినందుకా? అని ఆగ్రహం
- స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రుణమాఫీ డ్రామా అని విమర్శ
రుణమాఫీ చేశామంటూ కాంగ్రెస్ సంబరాలు చేసుకోవడం విడ్డూరమని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారో చెప్పాలన్నారు. రబీ, ఖరీఫ్‌లో చెల్లించాల్సిన రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టినందుకా? రుణమాఫీలో కోత పెట్టి రైతులను మోసం చేసినందుకా? అని ఎద్దేవా చేశారు. పంట నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెట్టినందుకు సంబరాలు చేసుకుంటున్నారా? అని నిలదీశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ రుణమాఫీ డ్రామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రబీ, ఖరీఫ్ సీజన్‌లో రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. రైతు భరోసా సదస్సుల పేరుతో జాప్యం చేస్తూ రైతులను అరిగోస పెడతారా? అన్నారు.