జగన్ ధనదాహం వల్ల అంధకారంలోకి పేదలు: దేవినేని ఉమ
- పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో వైసీపీ వేల కోట్లు దోచుకుందన్న ఉమ
- నాసిరకం పనుల వల్ల గృహప్రవేశానికి ముందే ఇళ్లు కూలాయని విమర్శ
- ఇళ్ల నిర్మాణంలో అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్ లోని పేదల జీవితాలను జగన్ తన అవినీతి, ధనదాహంతో అంధకారంలోకి నెట్టాడని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల దోపిడీతో పేదవారి సొంతింటి కల కళ్లముందే చెదిరిపోయిందన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో వారు వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. వేల టన్నుల ఐరన్, సిమెంట్ దోచేశారని విమర్శించారు. ఇళ్లు కట్టకుండానే బిల్లులు కాజేశారని, కట్టిన కొన్ని ఇళ్లు కూడా నాసిరకంగా కట్టారని ఆరోపించారు. దీంతో గృహప్రవేశానికి ముందే కొన్ని ఇళ్లు కూలిపోయాయని అన్నారు.
ఈ మేరకు గురువారం పేరేచర్లలోని జగనన్న కాలనీలో ఇళ్లను దేవినేని ఉమ పరిశీలించారు. ఏ ఇల్లు చూసినా నేడో రేపో కూలిపోయేలానే ఉందని ఆరోపించారు. కిచెన్, హాల్ లలో పునాది కుంగిపోవడం చూపిస్తూ.. పేదలంటే జగన్ కు ఎందుకంత అలుసని ప్రశ్నించారు. సిమెంట్ కు బదులు బూడిదను వాడి ఉంటారని, అందుకే గోడలు బీటలువారగా, పునాది కుంగిపోయిందని తీవ్ర విమర్శలు చేశారు. అక్రమార్కులపై కఠినచర్యలు తీసుకుని, వారి నుంచి సొమ్ము రికవరీ చేయాలని ప్రభుత్వాన్ని ఉమ కోరారు.