రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తామని చెబితే అందరూ ఆశ్చర్యపోయారు: భట్టివిక్రమార్క

  • ఆగస్ట్ దాటకుండానే రుణమాఫీ చేస్తామన్న ఉపముఖ్యమంత్రి
  • అర్హులైన వారందరికీ రుణమాఫీ చేస్తామని స్పష్టీకరణ
  • ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ హామీలను అమలు చేస్తున్నామన్న భట్టివిక్రమార్క
  • రుణమాఫీ అమలు చేస్తామని చెబితే ఓట్లు, సీట్ల కోసం అనుకున్నారని వ్యాఖ్య
రుణమాఫీ అమలు కోసం తాము నిద్రలేని రాత్రులు గడిపామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఆగస్ట్‌లోగా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబితే అందరూ ఆశ్చర్యపోయారన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రుణమాఫీని కచ్చితంగా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెబితే ఓట్ల కోసం, సీట్ల కోసం అనుకున్నారని పేర్కొన్నారు.

 కానీ ఇప్పుడు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రుణమాఫీ చేయబోతున్నామన్నారు. ఆగస్ట్ దాటకుండానే రుణమాఫీ చేస్తామన్నారు. ఇందుకోసం ఎంతో శ్రమించామన్నారు. అర్హులైన వారందరికీ రుణమాఫీ చేస్తామన్నారు.

రేషన్ కార్డులు లేని 6 లక్షల కుటుంబాలకూ రుణమాఫీ చేస్తామన్నారు. రూ.7 లక్షల కోట్ల అప్పుతో అధికారం చేపట్టినప్పటికీ తాము నెలల వ్యవధిలోనే రుణమాఫీ చేస్తున్నామన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ హామీలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. 


More Telugu News