చివరిరోజు వరకూ సిల్క్ స్మిత క్రేజ్ తగ్గలేదు: డాన్సర్ అనూజ రెడ్డి
- ఒకప్పుడు హాట్ బ్యూటీ అనిపించుకున్న అనూజ
- సిల్క్ స్మితతో కలిసి నటించానని వెల్లడి
- ఆమె మంచి మనిషి అంటూ కితాబు
- స్మిత ప్రత్యేకతలను గురించి చెప్పిన అనూజ
తెలుగు తెరపై సిల్క్ స్మిత.. అనురాధల హవా కొనసాగుతున్న సమయంలో అదే బాటలో ముందుకు వెళుతూ తనదైన ప్రత్యేకతను చాటుకున్న నటిగా అనూజ రెడ్డి కనిపిస్తారు. డాన్సర్ గాను .. వ్యాంప్ పాత్రలలోను ఆమె చాలా సినిమాలలో నటించారు. వివాహమైన తరువాత సినిమాలకు దూరమైన ఆమె, 20 ఏళ్ల తరువాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు.
తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్యూలో అనూజ మాట్లాడుతూ, "మాది గుంటూరు .. నా చిన్నప్పుడే మద్రాసుకి వెళ్లిపోయాము. అయినా మా ఇంట్లో అందరం తెలుగే మాట్లాడుతూ ఉంటాము. తమిళంలో చేసిన 'చిన్నతంబి' .. తెలుగు నుంచి నాకు అవకాశాలు వచ్చేలా చేసింది. బ్రహ్మానందం .. బాబూ మోహన్ .. సుధాకర్ తో కలిసి ఎక్కువ సినిమాలు చేశాను" అని అన్నారు.
"సిల్క్ స్మితతో కలిసి నేను నటించాను. ఆమె బిజీగా ఉండటం వలన చేయలేకపోయిన సినిమాలనే అప్పట్లో మేమంతా చేశామని చెప్పాలి. సిల్క్ స్మిత చాలా అందంగా ఉండేది .. బయటకూడా ఆమె అలాగే మాట్లాడేది. తన మేకప్ తానే చేసుకోవడం.. తన డ్రెస్ డిజైన్ తానే చేసుకోవడం ఆమె ప్రత్యేకత. ఆమెకి గర్వం .. పొగరు అని చాలామంది అంటూ ఉంటారు. కానీ నిజానికి ఆమె చాలా మంచి మనిషి. చనిపోయేంతవరకూ ఆమె క్రేజ్ ఎంతమాత్రం తగ్గకపోవడం మేము చూశాము" అని చెప్పారు.