తమిళనాడులో హత్యకు గురైన బీఎస్పీ అధ్యక్షుడి కుటుంబానికి కేంద్రమంత్రి పరామర్శ
- ఈ నెల 5 హత్యకు గురైన రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్
- ఇంటికి వెళ్లి నివాళులు అర్పించిన కేంద్రమంత్రి రాందాస్ అథవాలే
- ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
తమిళనాడులో హత్యకు గురైన బీఎస్పీ నేత కె.ఆర్మ్‌స్ట్రాంగ్ కుటుంబాన్ని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే బుధవారం పరామర్శించారు. ఆర్మ్‌స్ట్రాంగ్ ఇటీవల హత్యకు గురయ్యాడు. చెన్నై పెరంబూర్‌లో ఈ నెల 5న ఆయన హత్యకు గురయ్యాడు. ఆర్మ్‌స్ట్రాంగ్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి కేంద్రమంత్రి నివాళులు అర్పించారు.
చెన్నైలో నిర్మాణంలో ఉన్న ఆయన ఇంటి బయట కొంతమంది వ్యక్తులు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. ఓ నిందితుడు ఆదివారం నాడు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. అతను పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతనిని ఎన్‌కౌంటర్ చేశారు.