తెలంగాణ ఆదాయం బాగుందని చంద్రబాబు కూడా చెప్పారు: బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి
- రుణమాఫీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న మాజీ మంత్రి
- రైతుబంధుకు పట్టాదారు పాస్ బుక్ ప్రామాణికమన్న నిరంజన్ రెడ్డి
- ఐదెకరాల లోపు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్
రుణమాఫీ అమలుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో ఆదాయం బాగుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్పారని గుర్తు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైతుబంధుకు పట్టాదారు పాస్ బుక్ ప్రామాణికం అన్నారు. ఐదు ఎకరాల లోపు రైతులకు వెంటనే రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పాస్ బుక్ ప్రామాణికత అయినప్పుడు రైతు భరోసా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రుణమాఫీ ఇచ్చిన రైతుకు రైతు భరోసా ఎందుకివ్వరన్నారు. రుణమాఫీ ఒకే విడతలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.29వేల కోట్ల రుణాలు మాఫీ చేసిందన్నారు.
ఏదో కొంతమందికి రుణమాఫీ చేసి సంబరాలు చేసేందుకు సిద్ధపడకండి... పట్టాదారు పుస్తకం ఉన్న ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్‌లో రుణమాఫీ డబ్బులు వేయాలని సూచించారు. లేకపోతే రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేసినట్లే అన్నారు. పాస్‌బుక్ ప్రామాణికం అయినప్పుడు రైతు భరోసా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.