తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించి మొబైల్ ఫోనులో రికార్డింగ్.. యువకుడి దారుణం!
- ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలోని ఖైర్ పోలీస్ స్టేషన్‌లో ఘటన
- భూవివాదం తేల్చుకునేందుకు స్టేషన్‌కు వచ్చిన తల్లీకొడుకులు
- స్టేషన్ బయకువెళ్లి మళ్లీ వస్తున్న తల్లిపై అకస్మాత్తుగా పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు
- 40 శాతం కాలిన గాయాలతో మహిళ మృతి
ఉత్తరప్రదేశ్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు పోలీస్ స్టేషన్ బయట తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాల పాలైన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. భూవివాదం కారణంగా యువకుడు ఈ దారునికి పాల్పడ్డాడు. తల్లి మంటల్లో చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తుంటే అతడేమో అత్యంత పాశవికంగా ఆ దారుణ దృశ్యాన్ని వీడియోలో రికార్డు చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అలీగఢ్‌లోని ఖైర్ పోలీస్ స్టేషన్‌లో ఈ దారుణం జరిగింది. ఓ స్థలం విషయమై తల్లి హేమలత, కొడుకు గౌరవ్ మధ్య వివాదం నడుస్తోంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. విషయాన్ని పరిష్కరించుకునేందుకు వారు మరోసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో బయటకు వెళ్లిన మహిళ తిరిగొస్తుండగా బయటే నిలబడ్డ కుమారుడు గౌరవ్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మహిళ తాళలేక కిందపడి గిలగిలా కొట్టుకుంది. మరోవైపు కొడుకేమో అత్యంత క్రూరంగా ఈ దృశ్యాలను తన మొబైల్ ఫోనులో రికార్డు చేశాడు. మంటలు ఒక్కసారిగా ఎగసిపడడంతో క్షణకాలం వెనకడుగు వేసిన పోలీసులు.. ఆ మరుక్షణమే తేరుకుని ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. ఒంటిపై గోనెసంచులు వేసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఆ తరువాత బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమెకు 40 శాతం కాలినగాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో పోలీసులు కూడా గాయాల పాలయ్యారు.