లక్షల కోట్లలో జాంబీ సికాడాలు.. విచిత్ర సంగతులు
కీటకాల ప్రపంచం చాలా విచిత్రమైంది. కొన్ని కీటకాలు పుట్టిన గంటలు, రోజుల వ్యవధిలో మరణిస్తే మరికొన్ని ఏళ్ల పాటు జీవించే ఉంటాయి. మరికొన్ని సంతానోత్పత్తి కోసం సుదూరాలు ప్రయాణిస్తాయి. ఇలాంటి పలు విశేషాలతో కూడిన అరుదైన కీటకం సికాడా. ఇది కీచురాయి లాంటి కీటకం. ఇక లక్షల కోట్ల సంఖ్యలోని సికాడాలు స్ప్రింగ్ సీజన్‌లో అమెరికాపై దండెత్తబోతున్నాయట. వీటి జీవిత కాలం 20 ఏళ్లు. జీవితమంతా భూమిపొరల్లో గడిపేసే ఇవి సంతానోత్పత్తి కోసమే బయటకు వస్తాయి. ఈసారి అమెరికాలోని పలు రాష్ట్రాలను ఇవి ముంచెత్తనున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు. ఇవి తమతో పాటు ఓ ఫంగస్‌ను మోసుకురానున్నాయట. మరి ఈ కీటకం విశేషాలేంటో.. అవి తీసుకురానున్న ఫంగస్‌తో ఏదైనా ప్రమాదం ఉందేమో అన్నవి ఈ వీడియోలో తెలుసుకుందాం!