గురుగ్రామ్ లో దారుణం... ఆర్థోస్కోపీ కోసం ఆసుప్రతిలో చేరిన విదేశీ మహిళపై అత్యాచారం
- కజకిస్థాన్ నుంచి భారత్ వచ్చిన మహిళ
- ఈ నెల 9న హర్యానాలోని గురుగ్రామ్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిక
- ఈ నెల 13న ఆర్థోస్కోపీ నిర్వహించిన వైద్యులు
- మహిళ మత్తులో ఉండగా అత్యాచారానికి పాల్పడిన అటెండెంట్
- అరెస్ట్ చేసిన పోలీసులు
మానవతా విలువలు మంటగలిసిపోతున్నాయనడానికి నిదర్శనంగా గురుగ్రామ్ లో దారుణం చోటుచేసుకుంది. ఆర్థోస్కోపీ చేయించుకున్న విదేశీ మహిళపై ఆసుపత్రిలో అత్యాచారం జరిగింది.
కజకిస్థాన్ కు చెందిన 51 ఏళ్ల విదేశీ మహిళ హర్యానాలోని గురుగ్రామ్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 9న ఆమె ఆసుపత్రిలో చేరగా, 13వ తేదీన ఆమెకు ఆర్థోస్కోపీ నిర్వహించారు. కాగా, మత్తులో ఉన్న ఆమెపై ఆర్టిమిస్ ఆసుపత్రిలో అటెండెంట్ గా పనిచేసే ఠాకూర్ సింగ్ (24) అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని గమనించిన బాధితురాలి కుమార్తె ఆసుపత్రి సిబ్బందిని అప్రమత్తం చేశారు.
ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. దీనిపై ఆసుపత్రి వర్గాలు స్పందిస్తూ, నిందితుడ్ని తాత్కాలికంగా ఉద్యోగం నుంచి తొలగించినట్టు వెల్లడించాయి. దర్యాప్తునకు సహకరిస్తామని తెలిపాయి.