మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన విజయసాయిరెడ్డి
- సంచలనం సృష్టిస్తున్న శాంతి బిడ్డ వ్యవహారం
- విజయసాయి పేరు ప్రముఖంగా వినిపిస్తున్న వైనం
- ప్రెస్ మీట్ పెట్టి మరీ విజయసాయి పేరు చెప్పిన శాంతి భర్త
- నిన్న మీడియా ప్రతినిధులపై విజయసాయి వ్యాఖ్యలపై లోకేశ్ అభ్యంతరం
శాంతి బిడ్డకు తండ్రెవరు?... ఏపీ రాజకీయ వర్గాల్లోనే కాదు, జనాల్లో కూడా ఇది హాట్ టాపిక్ గా మారింది. శాంతి వ్యవహారంలో విజయసాయిరెడ్డి పేరు వినిపిస్తుండంతో ఈ విషయానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
తనపై జరుగుతున్న ప్రచారాన్ని నిన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన కొందరు మీడియా ప్రతినిధులను, ఏరా, ఓరేయ్, వాడు... అంటూ సంబోధించడం పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పెద్దల సభ ప్రతినిధిగా ఉన్నారు... అధికారం పోయినా మీకు అహంకారం తగ్గలేదు... మీడియా ప్రతినిధులను మీరు అసభ్యంగా దూషించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
తాజాగా, లోకేశ్ ట్వీట్ పై విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. "నారా లోకేశ్, అతడి కుల మీడియాలో చాలావరకు పాశ్చాత్య మీడియా తరహాలో స్వేచ్ఛను కోరుకుంటున్నప్పటికీ, ఆ మీడియా పనితీరు మాత్రం ఉత్తర కొరియా మీడియా లాగా ఉంది. పాత్రికేయ విలువలను వారు తుంగలో తొక్కారు. అది ప్రజాప్రతినిధుల విషయం కానివ్వండి, మహిళా లోకానికి సంబంధించినదైనా, లేక ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజాప్రతినిధులతో ముడిపడిన అంశమైనా సరే... తమ రాజకీయ గురువుల మాటే శిరోధార్యంగా, తమ కుల ప్రయోజనాల పరిరక్షణకు పెద్ద పీట వేస్తూ... టీఆర్పీ రేటింగుల వెంట పరుగులు తీస్తున్నారు" అంటూ విజయసాయి ధ్వజమెత్తారు.