కమిషన్ ఛైర్మన్ ను మార్చమని చెప్పిన సుప్రీం.. ఓకే చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
- జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని కోర్టుకెక్కిన మాజీ సీఎం
- మంగళవారం విచారణకు చేపట్టిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం
- కమిషన్ ఛైర్మన్ తీరును తప్పుబట్టిన బెంచ్
తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై కాంగ్రెస్ సర్కారు నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. విచారణ పూర్తికాకముందే కమిషన్ ఓ నిర్ణయానికి వచ్చిందని ఆక్షేపించింది. ఈమేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తొలుత హైకోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు తోసిపుచ్చింది. దీంతో కేసీఆర్ సుప్రీంకోర్టు తలుపుతట్టారు.
ఈ పిటిషన్ పై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కేసీఆర్ తరఫున ముకుల్ రోహత్గి, తెలంగాణ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా, కమిషన్ తరఫున గోపాల్‌శంకర్ నారాయణన్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. జస్టిస్ నరసింహారెడ్డి తీరును ఆక్షేపించింది. కమిషన్ ఛైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడం నింబంధనలకు విరుద్ధమని పేర్కొంది. అయితే, కమిషన్ చైర్మన్ ను మార్చేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. దీంతో కమిషన్ కు కొత్త చైర్మన్ పేరును మధ్యాహ్నం కోర్టుకు వెల్లడిస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తెలిపారు.