హైదరాబాద్ లో మహిళపై ఇద్దరు యువకుల అత్యాచారం
- ఆటోలో తీసుకెళ్లి మహిళపై అత్యాచారం
- అల్వాల్ లో శుక్రవారం జరిగిన ఘోరం.. ఆలస్యంగా వెలుగులోకి
- బలవంతంగా మద్యం తాగించి గ్యాంగ్ రేప్
భర్త వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బలవంతంగా మద్యం తాగించి దారుణానికి తెగబడ్డారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని అల్వాల్ లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. యాప్రాల్‌కు చెందిన 29 ఏళ్ల మహిళ భర్త వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి అల్వాల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఇందుకోసం ఆమె ఉబెర్ ఆటోను బుక్ చేసుకుంది. అయితే, బాధితురాలిపై కన్నేసిన ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్ దగ్గరే కాపుకాశాడు. స్టేషన్ నుంచి ఆమె బయటకురాగానే యాప్రాల్ లో దింపేస్తానని ఆటో ఎక్కించుకున్నాడు. ఆపై సానుభూతి మాటలు చెబుతూ ఓ వైన్ షాప్ దగ్గర ఇద్దరు వ్యక్తులను ఎక్కించుకున్నాడు.
వారిద్దరూ మద్యం తాగుతూ బలవంతంగా బాధితురాలికీ తాగించారు. ఆపై ఆటోను వెంకట్రావ్ లేన్ లోని నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఓ కారులోకి ఎక్కించారు. తర్వాత ఆటో డ్రైవర్ వెళ్లిపోగా.. మిగతా ఇద్దరు ఆమెపై కారులోనే అత్యాచారం చేశారు. శనివారం తెల్లవారుజామున వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు గణేశ్ ఆలయం వద్దకు చేరుకుంది. స్థానికుల సాయంతో పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసింది. బొల్లారం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలిని పీఎస్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకుని.. కేసును అల్వాల్ స్టేషన్ కు బదిలీ చేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన అల్వాల్ పోలీసులు.. ఆటో నెంబర్ సాయంతో డ్రైవర్ ను అరెస్టు చేశారు. అయితే, మహిళపై అత్యాచారం చేసిన నిందితులు మాత్రం ఇంకా దొరకలేదని పోలీసులు తెలిపారు.