కబ్జాలకు గురైన భూములను తప్పకుండా ప్రభుత్వానికి అప్పగిస్తాం: ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి
- వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడ్డారన్న రాంప్రసాద్ రెడ్డి
- తిరుపతి మఠాల భూములను కూడా ఆక్రమించారని ఆరోపణ
- పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో గ్రానైట్ కొండలను మింగేశారని మండిపాటు
గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడ్డారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి మఠాల భూములను కాజేశారని మండిపడ్డారు. దేవాదాయ శాఖకు చెందిన భూములను భారీగా ఆక్రమించేశారని చెప్పారు. కబ్జాకు గురైన భూములను తప్పకుండా ప్రభుత్వానికి అప్పగిస్తామని తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో గ్రానైట్ కొండలను మింగేశారని చెప్పారు. ప్రతి రోజు వేల ట్రిప్పులతో ఇసుకను తరలించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ బాధితులు ఎవరైనా సరే ప్రభుత్వం వద్దకు వస్తే వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.