ఇది ఆటోమెటిక్ పానీపూరి మిషన్ గురూ.. ఇందులో మరో స్పెషల్ కూడా ఉంది!
- బెంగళూరులో కనిపిస్తున్న పానీపూరి కియోస్క్‌లు
- ఇంటర్నెట్‌కు ఎక్కిన హెచ్ఎస్ఆర్ లే అవుట్ మెషీన్
- ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ‘వాట్ ద ఫ్లేవర్స్’
- పలు రకాల ఫ్లేవర్లలో ‘పానీ’
ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశంలోని ప్రతి ఒక్కరు ఇష్టంగా తినేది పానీపూరినే. అయితే, అపరిశుభ్ర వాతావరణంలో విక్రయించడం, విక్రయదారులు పరిశుభ్రత పాటించకపోవడంపై తరచూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు చేసిన సర్వేలో 90 శాతానికిపైగా పానీపూరీలు తినడానికి పనికిరావని తేల్చేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా బెంగళూరులోని హెచ్ఎస్‌ఆర్ లేఅవుట్‌లో ఓ పానీపూరి మిషన్ అందరినీ అమితంగా ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది ఆటోమెటిక్ పానీపూరి వెండింగ్ మిషన్. ఇలాంటి వెండింగ్ మెషీన్లు, కియోస్క్‌లు బెంగళూరులో సర్వసాధారణమైన విషయమే అయినా, తాజాగా వైరల్ అయిన స్టాల్ పేరు మాత్రం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
ఈ ఆటోమెటిక్ పానీపూరి మెషీన్ పేరు ‘డబ్ల్యూటీఎఫ్’.. అంటే ‘వాట్ ద ఫ్లేవర్స్’. ఈ మిషన్‌లో పానీపూరిలో వేసే వాటర్ కోసం పలు ట్యాప్‌లు అమర్చారు. వీటిలో పలు ఫ్లేవర్లతో కూడిన వాటర్ ఉంటుంది. వినియోగదారులు తమకు నచ్చిన ఫ్లేవర్డ్ వాటర్‌ను ఎంచుకోవచ్చు. పరిశుభ్రతకు పెద్దపీట వేయడంతోపాటు నచ్చిన ఫ్లేవర్డ్ వాటర్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉండడంతో పానీపూరి ప్రియులు ఇప్పుడీ మిషన్ వద్దకు క్యూకడుతున్నారు.