చెప్పుతో కొడతా.. చేతకానివాళ్లం అనుకుంటున్నావా?.. టీడీపీ ఎమ్మెల్యే జనార్దన్‌పై బాలినేని ఫైర్

  • ఎన్నికల్లో ఓటమి తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయిన బాలినేని
  • నిన్న ఒంగోలుకు తిరిగి వచ్చి విలేకరుల సమావేశం
  • దమ్ముంటే తనతో తలపడాలంటూ జనార్దన్‌కు సవాలు
  • తనను ఓడించింది తన పార్టీ వారేనన్న మాజీ మంత్రి
ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై వైసీపీ నేత, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తమను చేతకానివాళ్లుగా అనుకోవద్దని, చెప్పుతో కొడతానని హెచ్చరించారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం హైదరాబాద్ వెళ్లిపోయిన బాలినేని నిన్న తిరిగి ఒంగోలు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన వియ్యంకుడు నిర్మిస్తున్న శ్రీకర విల్లాలో ఎలాంటి అక్రమాలు జగరలేదని పేర్కొన్నారు. 

‘‘ఆ విల్లాలోకి దౌర్జన్యంగా మనుషుల్ని పంపిస్తావా? చెప్పుతో కొడతా. ఏం చేతకానివాళ్లం అనుకుంటున్నావా? తెగించామంటే ఎవడికీ అందదు. మర్యాదస్తుల కుటుంబంలో పుట్టినోళ్లం మేంం. ఈ రకంగా చెడు చేష్టలు చేస్తే ఊరుకోను. దమ్ముంటే నాతో రా.. కార్యకర్తలతో కాదు’’ అంటూ జనార్దన్‌పై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఎందుకు ఓడించారో?
ఈ ఎన్నికలే తనకు చివరివి అని చెప్పినా ప్రజలు ఎందుకు ఓడించారో అర్థం కావడం లేదని బాలినేని వాపోయారు. తమ పార్టీ వారే ఓడించారని, వారెవరో తనకు తెలుసని చెప్పారు. ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉందామని అనుకున్నానని కానీ, కార్యకర్తలపై జరుగుతున్న దాడులు చూసి తట్టుకోలేక తిరిగి వచ్చానని వివరించారు. ఎన్నికలకు ముందు తనపైనా, తన కుమారుడిపైనా చేసిన అరోపణలను నిరూపించాలని టీడీపీ నేతలను సవాల్ చేశారు. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి పేరును అధిష్ఠానం పరిశీలిస్తోందని విలేకరులు చెప్పగా అంతెత్తున లేచారు. జిల్లా గొడ్డు పోలేదని, ఈ జిల్లాలో నాయకులే లేరా? అని బాలినేని మండిపడ్డారు.


More Telugu News