నేడు సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్‌పై విచారణ

  • విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంపై కమిషన్ వేసిన తెలంగాణ ప్రభుత్వం
  • కేసీఆర్‌కు సమన్లు జారీ చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్
  • సమన్లు జారీ చేయడంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన కేసీఆర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. చత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలపై విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను నియమించింది. విచారణకు హాజరు కావాలని ఈ కమిషన్... కేసీఆర్‌కు సమన్లు ఇచ్చింది.

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇచ్చిన సమన్లపై కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ తనకు ఇచ్చిన సమన్లపై ఈ నెల 1వ తేదీన హైకోర్టు ఇచ్చిన తీర్పును కేసీఆర్ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈరోజు విచారణ జరుపుతానని తెలిపింది.

నిన్న, సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో మొదట కేసీఆర్ తరఫు న్యాయవాది మోహిత్ రావు పాస్ ఓవర్ కోరారు. ఆ తర్వాత కోర్టు పనివేళలు ముగిసిన సమయానికి కేసు విచారణకు రావడంతో రేపు విచారిస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.


More Telugu News