ఉగ్రవాదుల కాల్పుల్లో అమరులైన నలుగురు జవాన్లు
- దెస్సా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లుగా సమాచారం
- పోలీసులతో కలిసి నిర్బంధ తనిఖీలు ప్రారంభించిన జవాన్లు
- రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎదురుకాల్పులు
జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో సోమవారం రాత్రి భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు సైనికులు అమరులయ్యారు. ఇందులో ఓ ఉన్నతస్థాయి అధికారి ఉన్నారు. మరికొందరికి గాయాలయ్యాయి.
దెస్సా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లుగా సమాచారం అందింది. దీంతో పోలీసులు, సైనికులు కలిసి నిర్బంధ తనిఖీలు ప్రారంభించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఎదురుపడి కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాబలగాలు కాల్పులు ప్రారంభించారు.