జనసేనలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై బాలినేని స్పందన
- ఒంగోలులో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్న బాలినేని
- దమ్ముంటే తనపై ప్రతీకారం తీర్చుకోవాలని వ్యాఖ్యలు
- తాను జనసేనలోకి వెళుతున్నట్టు ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం
వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై బాలినేని స్పందించారు. ఒంగోలులో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, దమ్ముంటే తనపై ప్రతీకారం తీర్చుకోవాలని, కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కార్యకర్తలపై దెబ్బ పడితే తనపై పడినట్టేనని అన్నారు. గొడవలు ఎక్కువ అవుతాయన్న ఉద్దేశంతో తాను మధ్యలో జోక్యం చేసుకోవడంలేదని, కానీ అధికార పక్ష నేతల చర్యలు దుర్మార్గంగా ఉన్నాయని అన్నారు.
"ఒకాయనేమో అబ్బాకొడుకులు పారిపోయారంటూ ఫ్లెక్సీలు వేస్తాడు. బాలినేని జనసేన పార్టీలో చేరతాడంట అని ఓ జనసేన నేతతో చెప్పిస్తారు. ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి... మా పార్టీలో అవినీతిపరులను చేర్చుకోం అని ఒకాయనతో మాట్లాడిస్తారు. జనసేనలో చేరడానికి మేం వెంటపడుతున్నామా?" అని బాలినేని వ్యాఖ్యానించారు.