బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి వర్ష సూచన
- ఇప్పటికే కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి
- గత కొన్నిరోజులుగా ఏపీలో వర్షాలు
- రేపు కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు
- జులై 19 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే చాన్స్
ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయవ్య, పశ్చిమ బంగళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. మరోవైపు ఉపరితలం ఆవర్తనం, రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతున్నాయని, రేపు (జులై 16) కూడా ఏపీలో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది.
కాకినాడ, ఉభయ గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, పార్వతీపురం మన్యం, కోనసీమ, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం, పల్నాడు, అనకాపల్లి, కృష్ణా, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ వివరించింది.
కాగా, వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో జులై 19 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపింది.