కేజ్రీవాల్ ఆరోగ్యంతో జైలు అధికారులు చెలగాటమాడుతున్నారు: మంత్రి అతిశీ
- కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని శాశ్వతంగా దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపణ
- ఢిల్లీ సీఎం ముప్పై ఏళ్లుగా డయాబెటీస్ పేషెంట్ అన్న మంత్రి
- ఫేక్ కేసులో బీజేపీ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసిందని మండిపాటు
ఢిల్లీ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంతో జైలు అధికారులు చెలగాటమాడుతున్నారని ఢిల్లీ మంత్రి అతిశీ ఆరోపించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని శాశ్వతంగా దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీ సీఎం ముప్పై ఏళ్లుగా డయాబెటీస్ పేషెంట్ అని పేర్కొన్నారు. ఫేక్ కేసులో బీజేపీ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసిందని మండిపడ్డారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలలో చేయని సంక్షేమ కార్యక్రమాలు కేజ్రీవాల్ ఢిల్లీలో చేశారని, అయినప్పటికీ కేంద్రం పెద్దలు ఆయనను జైల్లో పెట్టారన్నారు. కేజ్రీవాల్‌ను జైల్లో చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇంతకుముందు నియంతలు... తమ ప్రత్యర్థులను జైల్లో పెట్టి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేసిన చరిత్రలు చదివామన్నారు. బీజేపీ ఇప్పుడు కేజ్రీవాల్‌కు మెడిసిన్స్, ఇన్సులిన్ నిలిపివేసిందన్నారు.
తన డాక్టర్‌ను కలవడానికి కూడా అనుమతించడం లేదన్నారు. కోర్టుకు వెళ్లిన తర్వాత మాత్రమే అరవింద్ కేజ్రీవాల్ ఇన్సులిన్ పొందారని, డాక్టర్‌ను సంప్రదించడానికి అనుమతి లభించిందని గుర్తు చేశారు. కేజ్రీవాల్‌కు స్ట్రోక్ వచ్చినా లేదా మెదడు దెబ్బతిన్నా బాధ్యులు ఎవరు? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ ప్రాణాలకు జైల్లో ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు ఏదైనా జరిగితే దేవుడు కూడా బీజేపీని క్షమించడన్నారు.