చిరంజీవి మనిషినంటూ నాకు అవకాశాలు ఇవ్వనివాళ్లు ఉన్నారు: నటుడు ప్రసాద్ బాబు
- రామారావుగారిని చూసి సినిమాల్లోకి వచ్చానన్న ప్రసాద్ బాబు
- అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డానని వ్యాఖ్య
- చిరంజీవిగారితో ఎక్కువ సినిమాలు చేశానని వెల్లడి
- శోభన్ బాబుగారి మాట వినడం మంచిదైందన్న ప్రసాద్ బాబు
ప్రసాద్ బాబు .. సీనియర్ నటుడు. హీరో కావాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన, ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్ట్ గా నిలబడ్డారు. ఎన్నో విభిన్నమైన పాత్రల ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. అలాంటి ప్రసాద్ బాబు కొంతకాలంగా నటనకి దూరంగా ఉంటున్నారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
"ఎన్టీ రామారావుగారి షూటింగ్ ఒకటి చూసిన తర్వాత, నటుడిని కావాలనే ఒక కోరిక బలపడింది. నాతో పాటు ప్రయత్నాలు చేసిన గిరిబాబు .. రంగనాథ్ .. శరత్ బాబు అంతా కూడా నా కంటే ముందుగా అవకాశాలు తెచ్చుకున్నారు. ఆ తరువాత నాకు ఛాన్స్ వచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే అవమానాలను ఫేస్ చేశాను. ఇంటి దగ్గర నుంచి నాన్న డబ్బు పంపించేవాడు. దేనికీ లోటు ఉండేది కాదు. కానీ నటుడిగా నిరూపించుకోవడం కోసం ఎన్నో అవమానాలను భరించాను" అని అన్నారు.
"చిరంజీవిగారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయనతో కలిసి చాలా సినిమాలు చేశాను. ఇద్దరం కలిసి భోజనం చేసేవాళ్లం .. వాకింగ్ చేసేవాళ్లం. చిరంజీవి మనిషి అనే కారణంగా నాకు అవకాశాలు ఇవ్వని వాళ్లు కూడా ఉన్నారు. చెన్నైలో నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు, అడగ్గానే చిరంజీవిగారు నాకు వెంటనే సాయం చేశారు. ఒకానొక సమయంలో ఆ ఇల్లు అమ్మేయాలనుకున్నప్పుడు శోభన్ బాబు గారు అలా చేయవద్దని చెప్పారు. ఆయన మాట వినడం మంచిదైంది" అని చెప్పారు.