పవన్ కల్యాణ్ టీమ్ అంటే అందరూ గొప్పగా చెప్పుకునేలా ఉండాలి: మంత్రి నాదెండ్ల మనోహర్
- మంగళగిరిలో జనసేన ప్రజాప్రతినిధులకు సన్మానం
- హాజరైన నాదెండ్ల మనోహర్
- కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మిత్రపక్షాలను కలుపుకుని వెళ్లాలని పిలుపు
జనసేన పార్టీ తరఫున ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులను నేడు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అధినేత పవన్ కల్యాణ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... ప్రస్తుతం తాము కూటమి ప్రభుత్వంలో ఉన్నందున మిత్రపక్షాలను కూడా కలుపుకుని వెళ్లాలని జనసేన ప్రజాప్రతినిధులకు సూచించారు.
"ఇది మన ప్రభుత్వం... జనసేన పార్టీకి, పవన్ కల్యాణ్ కు మంచి పేరు తెచ్చేలా పనిచేయాలి. పవన్ కల్యాణ్ టీమ్ అంటే అందరూ గొప్పగా చెప్పుకునేలా ఉండాలి. మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నికవడంతో మనకు పదవులు వచ్చాయి... కానీ మన విజయం కోసం పాటుపడిన జనసైనికులు, వీరమహిళలను మనం మర్చిపోకూడదు. ప్రతి జనసైనికుడు, వీరమహిళ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యమే.
జనసేన పార్టీ ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలపై విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలి... శ్వేతపత్రాలపై అవగాహన పెంచుకోవాలి. అన్నిటికంటే నిజాయతీగా పనిచేయడం ముఖ్యం" అని నాదెండ్ల మనోహర్ కర్తవ్య బోధ చేశారు.