తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి నిరుద్యోగుల యత్నం.. తీవ్ర ఉద్రిక్తత
- డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలంటూ సెక్రటేరియట్ ముట్టడికి యత్నం
- ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారుల నినాదాలు
డీఎస్సీ పరీక్ష నిర్వహణను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జనసభ, నిరుద్యోగులు తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సచివాలయం వైపు వెళ్తున్న ఆందోళనకారులను అడ్డుకోవడానికి పోలీసులు యత్నించడంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. బీసీ జనసభ నేత రాజారాం యాదవ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిరసనకారులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్సీ పరీక్షను వాయిదా వేయకపోతే సీఎం రేవంత్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉద్యోగాలు ఇవ్వమంటే పోలీసులతో రాజ్యం నడుపుతున్నారని సీఎంపై విమర్శలు గుప్పించారు.