ముచ్చుమర్రి, విజయనగరం ఘటనలు అత్యంత దారుణం: హోం మంత్రి అనిత

  • రాష్ట్రంలో శాంతిభద్రతలు, గంజాయిపై సీఎం సమీక్షించారన్న అనిత
  • ముచ్చుమర్రిలో బాలికను హత్య చేసి రిజర్వాయర్ లో పడేశారని వెల్లడి
  • బాలిక కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందిస్తున్నామని ప్రకటన
రాష్ట్రంలో శాంతిభద్రతలు, గంజాయి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారని హోం మంత్రి అనిత వెల్లడించారు. 

నంద్యాల జిల్లా ముచ్చుమర్రి, విజయనగరం ఘటనలు అత్యంత దారుణం అని వ్యాఖ్యానించారు. ముచ్చుమర్రిలో బాలికను హత్య చేసి రిజర్వాయర్ లో పడేశారని వెల్లడించారు. ముచ్చుమర్రి ఘటనలో నిందితులు మైనర్లు అని స్పష్టం చేశారు. మద్యం, గంజాయి, మత్తులో ఈ ఘటనలు జరిగాయని వెల్లడించారు.  

ఈ ఘటనలను స్పెషల్ కోర్టు ద్వారా విచారించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. నేరస్తులకు పార్టీ, కులం ఉండదని, ఎవరైనా సరే శిక్షించాల్సిందేనని అనిత ఉద్ఘాటించారు. 

ముచ్చుమర్రి ఘటనలో బాలిక కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. విజయనగరం ఘటనలో బాలిక పేరుతో రూ.5 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తున్నామని చెప్పారు.


More Telugu News