ఆదాయానికి మించి ఆస్తుల కేసు: డీకే శివకుమార్ పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
- 2013-18 కాలంలో కర్ణాటక మంత్రిగా పనిచేసిన డీకే శివకుమార్
- లెక్కకు మించి రూ.74 కోట్లు సంపాదించారని ఆరోపణలు
- డీకేపై ఐటీ దాడులు.... ఈడీ దర్యాప్తు... సీబీఐ కేసు నమోదు
- డీకే శివకుమార్ పిటిషన్ ను కొట్టివేసిన కర్ణాటక హైకోర్టు
- ఇవాళ డీకే క్వాష్ పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం
ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఎదుర్కొంటున్న కర్ణాటక డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ డీకే శివకుమార్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. ఇప్పటికే కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయని, దీనిపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
2013-18 కాలంలో కాంగ్రెస్ కర్ణాటకలో పాలన సాగించగా, అప్పట్లో డీకే శివకుమార్ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో డీకే శివకుమార్ తన ఆదాయంలో రూ.74 కోట్లకు పైగా ఆదాయానికి లెక్కలు చూపించలేకపోయారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు.
అప్పట్లో డీకేపై వచ్చిన ఆరోపణలతో ఐటీ శాఖ దాడులు కూడా చేపట్టింది. అనంతరం మనీలాండరింగ్ అంశాలపై ఈడీ దర్యాప్తు చేయగా, ఈడీ దర్యాప్తును ఆధారంగా చేసుకుని సీబీఐ కేసు నమోదు చేసింది.
దాంతో, డీకే శివకుమార్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. డీకే పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ ఆయనకు నిరాశ తప్పలేదు.