తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలపై రోహిత్ శర్మ స్పందన
- ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్న రోహిత్
- వన్డే, టెస్ట్ ఫార్మాట్ల నుంచి కూడా తప్పుకుంటాడని ఊహాగానాలు
- ఇంకొంత కాలం ఆడుతానని స్పష్టం చేసిన హిట్ మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. త్వరలోనే వన్డే, టెస్ట్ ఫార్మాట్ల నుంచి కూడా ఆయన తప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తన రిటైర్మెంట్ అంశంపై రోహిత్ స్పందించాడు.
తాను ఇంకొంత కాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతానని రోహిత్ స్పష్టం చేశాడు. సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడే ప్రణాళికలు తన వద్ద లేవని చెప్పాడు. అమెరికాలోని డాలస్ లో ఒక క్రికెట్ అకాడెమీ ప్రారంభోత్సవానికి రోహిత్ వెళ్లాడు. ఈ సందర్భంగా రిటైర్మెంట్ పై అక్కడి అభిమానులు అతనిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు సమాధానమిస్తూ... తన రిటైర్మెంట్ వస్తున్న ఊహాగానాలకు రోహిత్ తెరదించాడు.
ఈ నెలలో టీమిండియా శ్రీలంక టూర్ కు వెళ్లనుంది. అయితే, ఈ సిరీస్ నుంచి రోహిత్, విరాట్ కోహ్లీలకు విశ్రాంతిని ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో టీమిండియా వరుసగా మూడు సిరీస్ లను ఆడనుంది. శ్రీలంక టూర్ నుంచి కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బాధ్యతలను స్వీకరించనున్నాడు.