60కిపైగా కుక్కలను రేప్ చేసి చంపిన జువాలజిస్ట్.. 249 ఏళ్ల జైలుశిక్ష పడే చాన్స్!

  • ఆస్ట్రేలియాలోని డార్విన్ లో నివసించే ఓ బ్రిటన్ జాతీయుడి క్రూర ప్రవర్తన
  • ఇప్పటికే 60కిపైగా అభియోగాల్లో నేరాన్ని అంగీకరించిన నిందితుడు
  • చేసిన పనికి పశ్చాత్తాపం చెందుతున్నందున శిక్ష తగ్గించాలని కోరిన అతని లాయర్
  • తుది విచారణను వచ్చే నెలకు వాయిదా వేసిన కోర్టు
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 60కిపైగా కుక్కలను అతిదారుణంగా హింసించి, జుగుప్సాకరంగా వాటిపై అత్యాచారానికి పాల్పడి ఆపై హతమార్చినందుకు ఓ జువాలజిస్ట్ ఏకంగా 249 ఏళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియాలోని డార్విన్ లో నివసించే బ్రిటన్ కు చెందిన మొసళ్ల నిపుణుడు ఆడమ్ బ్రిట్టన్ పై నమోదైన కేసుకు సంబంధించిన తుది విచారణ గురువారం వాయిదా పడింది. తదుపరి విచారణ ఆగస్టులో జరగనుంది. ఈ కేసులో బ్రిట్టన్ పై 60కిపైగా అభియోగాలు నమోదవగా గతేడాది వాటన్నింటిలో నేరాన్ని అతను అంగీకరించాడు.

బ్రిటన్ వార్తాసంస్థ మిర్రర్ కథనం ప్రకారం బ్రిట్టన్ డజన్లకొద్దీ కుక్కలపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా వాటిని హింసించి చంపాడు. గురువారం ఈ కేసు విచారణ మొదలయ్యే సమయంలో ఎన్ టీ సుప్రీంకోర్టు జడ్జి మైఖేల్ గ్రాంట్ తన సిబ్బందిని, జంతుప్రేమికులను కోర్టు గదిలోంచి బయటకు వెళ్లాల్సిందిగా సూచించినట్లు ఆ వార్తాసంస్థ తెలిపింది.

‘ఈ కేసులోని ఆధారాలను చూస్తుంటే నరాల షాక్ లేదా ఇతర మనోవేదన కలిగించేలా అనిపిస్తోంది. ఇది జంతువులపట్ల జరిగిన అత్యంత హేయమైన హింస’ జడ్జి పేర్కొన్నట్లు ఏబీసీ వార్తాసంస్థ పేర్కొంది. ఈ కేసులో ప్రజలు తుది తీర్పు కోసం ఎదురుచూస్తుండగా నిందితుడి తరఫు న్యాయవాది కొత్త నివేదికను జడ్జికి సమర్పించాడు. దాన్ని పరిగణించాలని కోరాడు. జైల్లో సుమారు 30 గంటలపాటు సైకాలజిస్ట్ ద్వారా చికిత్స పొందిన అనంతరం అతని ప్రస్తుత మానసిక పరిస్థితి గురించి ఆ నివేదిక వివరించింది.

‘ఒక వ్యక్తి పశ్చాత్తాపం చెందుతుండటాన్ని అతను తిరిగి మానసికంగా కోలుకుంటున్నాడనేందుకు ఆధారంగా పరిగణించొచ్చు. ఒక వైద్యుడు మొదటిసారి ఒక రోగితో మాట్లాడినప్పుడే ఇలాంటివి బయటపడకపోవచ్చు. అవన్నీ చికిత్సతోపాటు క్రమంగా బయటపడతాయి’ అని బ్రిట్టన్ తరఫు న్యాయవాది వాదించాడు. అందువల్ల తన క్లయింట్ కు విధించే జైలు శిక్షను తగ్గించాలని కోర్టును కోరాడు. బ్రిట్టన్  చిన్నప్పటి నుంచే మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని చెప్పాడు. అది అతని తప్పు కాదని.. చాలా సమాజాలు అలాంటి వారిని దూరంపెడతాయని వివరించాడు. మానసిక సమస్యలతో పెరిగి పెద్దవడం ఎంతో కష్టమనే విషయాన్ని కోర్టు గుర్తించాలని కోరాడు.

ఏబీసీ వార్తాసంస్థ కథనం ప్రకారం.. బ్రిట్టన్ కుక్కలను హింసించి చంపేవాడు. ఆ తతంగాన్ని రికార్డు చేసేవాడు. కుక్కలను హింసించేందుకు ఒక షిప్పింగ్ కంటెయినర్ ను టార్చర్ గదిగా మార్చుకున్నాడు. అందులోనే కుక్కలను లైంగికంగా హింసించేవాడు.


More Telugu News