నేడు బెంగళూరుకు జగన్.. వారం రోజుల పాటు అక్కడే!
- 22 నుంచి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం
- జగన్ హాజరుపై పార్టీ నుంచి లేని స్పష్టత
- నేటి నుంచి ప్రారంభం కావాల్సిన జగన్ ‘ప్రజాదర్బార్’ వాయిదా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మరోమారు బెంగళూరు వెళ్లనున్నారు. వారం రోజులపాటు ఆయన అక్కడే ఉంటారని సమాచారం. అయితే, ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల నాటికి ఆయన ఏపీకి తిరిగి వస్తారా? రారా? అన్న విషయంలో పార్టీ నుంచి స్పష్టత లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత జగన్ బెంగళూరు వెళ్లడం ఇది రెండోసారి. గత నెల 24న బెంగళూరు వెళ్లిన ఆయన ఈ నెల ఒకటో తేదీ వరకు అక్కడే గడిపారు.
మరోవైపు, నేటి నుంచి తాడేపల్లిలోని తన క్యాంపులో ప్రజా దర్బార్ నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. ఈ విషయమై పార్టీ శ్రేణులకు ఇప్పటికే సమాచారం అందింది. పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు, ప్రజల్ని జగన్ కలిసేలా కార్యక్రమం రూపొందించారు. అయితే, అది వాయిదా పడింది. అధికారంలో ఉండగా ప్రజల్ని కలిసేందుకు రూపొందించిన ‘స్పందన’ కార్యక్రమం కూడా ఇలానే వాయిదా పడుతూ ఒక్కసారి కూడా నిర్వహించలేకపోయారు.