వరుసగా రెండో ఏడాది వింబుల్డన్ టైటిల్ గెలిచిన స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కరాజ్

  • ఏకపక్షంగా సాగిన వింబుల్డన్ ఫైనల్
  • ఫైనల్లో 6-2, 6-2, 7-6తో జకోవిచ్ ను ఓడించి అల్కరాజ్
  • గతేడాది కూడా వింబుల్డన్ నెగ్గిన స్పెయిన్ యువ కిశోరం
స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో విజేతగా అవతరించాడు. ఇవాళ ఏకపక్షంగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల అల్కరాజ్ 6-2, 6-2, 7-6తో దిగ్గజ క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్ ను ఓడించాడు. 

తొలి రెండు సెట్లలో అల్కరాజ్ జోరుకు ఎదురులేకుండా పోయింది. మూడో సెట్లో జకోవిచ్ నుంచి ప్రతిఘటన ఎదురు కాగా, ఆ సెట్ టైబ్రేకర్ కు మళ్లింది. టైబ్రేకర్ లో విజృంభించిన అల్కరాజ్ 7-4తో గెలిచి, జకోవిచ్ పై చిరస్మరణీయ విజయం నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో జకోవిచ్ అనేక అన్ ఫోర్స్ డ్ ఎర్రర్స్ (అనవసర తప్పిదాలు) చేసి మూల్యం చెల్లించుకున్నాడు. 

కాగా, 2023లోనూ కూడా అల్కరాజ్ వింబుల్డన్ టైటిల్ నెగ్గాడు. అప్పుడు కూడా జకోవిచ్ తోనే ఫైనల్ ఆడాడు. ఈ ఏడాది ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ ను ఖాతాలో వేసుకున్న స్పెయిన్ యువకిశోరం అల్కరాజ్, వింబుల్డన్ ను కూడా చేజిక్కించుకుని ఈ ఏడాది రెండో మేజర్ టైటిల్ ను చేజిక్కించుకున్నాడు.


More Telugu News