ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ఊరటనిచ్చే నిర్ణయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

తాళ్లు ఎక్కుతూ ప్రమాదవశాత్తు మరణించిన కల్లు గీత కార్మికుల కుటుంబాలకు గత ప్రభుత్వం పెండింగ్  లో పెట్టిన రూ.7.90 కోట్ల ఎక్స్ గ్రేషియా మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.

ఇవాళ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ గూడ గ్రామంలోని తాటి చెట్ల వనంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తాటిచెట్లు ఎక్కేటప్పుడు గీత కార్మికులు ప్రమాదాల బారినపడకుండా రక్షించే కాటమయ్య రక్షణ కవచంను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎక్స్ గ్రేషియా పెండింగ్ అంశంపై కల్లు గీత కార్మికుల కుటుంబాలకు ఊరటనిచ్చే ప్రకటన చేశారు. అంతేకాదు, గీత కార్మికులు తాటి చెట్ల మీద నుంచి పడకుండా తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్, లెగ్ లూప్ వంటి ఆరు పరికరాలతో కూడిన కిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 

ఈ కిట్లను రూపొందించింది ఎవరో కాదు... గతంలో పర్వతారోహణ చేసి తెలంగాణ ఖ్యాతిని ఘనంగా చాటిన మాలావత్ పూర్ణ. ఈ సందర్భంగా మాలావత్ పూర్ణ బృందాన్ని రేవంత్ రెడ్డి అభినందించారు.


More Telugu News