నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి

  • నేపాల్ లో రాజకీయ సంక్షోభం
  • అధికార బదలాయింపు ఒప్పందానికి తిలోదకాలిచ్చిన మాజీ ప్రధాని ప్రచండ
  • ప్రచండకు మద్దతు ఉపసంహరించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్)
  • ప్రధాని పదవి నుంచి దిగిపోయిన ప్రచండ
  • నేపాల్ కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్)
నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి గద్దెనెక్కనున్నారు. కేపీ శర్మ ఓలి రేపు నేపాల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేపాల్ లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండగా... ఒప్పందం ప్రకారం అధికార బదలాయింపునకు మాజీ ప్రధాని ప్రచండ అంగీకరించకపోవడం, ఆయనకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్) మద్దతు ఉపసంహరించుకోవడం తెలిసిందే. దాంతో ప్రచండ ప్రధాని పదవి నుంచి దిగిపోక తప్పలేదు. దాంతో, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్)... నేపాల్ కాంగ్రెస్ తో జట్టు కట్టి నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే కేపీ శర్మ ఓలిని ప్రధాని పదవి వరించింది.


More Telugu News