సీక్రెట్ సర్వీస్ మెరుపువేగం.. రెప్పపాటు కాలంలో ట్రంప్‌పై కాల్పుల జరిపిన నిందితుడి కాల్పివేత.. వీడియో ఇదిగో
- భద్రతలో భాగంగా అప్పటికే సిద్ధంగా ఉన్న స్నైపర్ తక్షణ స్పందన
- మరు సెకన్‌లోనే బుల్లెట్ల వర్షం.. నిందితుడు మృతి
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాల్పుల ఘటనను అన్ని దేశాలు ఖండిస్తున్నాయి. కాగా కాల్పుల ఘటనలో ట్రంప్ ప్రాణాలను రక్షించడంలో యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కీలక పాత్ర పోషించారు. మెరుపువేగంతో స్పందించారు. కాల్పులు జరిగిన క్షణకాలంలో నిందితుడిని మట్టుబెట్టారు.
భద్రతలో భాగంగా అప్పటికే ర్యాలీ ఆవరణలో ఎత్తైన ప్రాంతం నుంచి సిద్ధంగా ఉన్న ఇద్దరు స్నైపర్లలో ఒకరు రెప్పపాటులో నిందితుడిని కాల్చిపడేశాడు. బుల్లెట్ తగిలిందని గమనించి ట్రంప్ కిందికి వంగే లోపలే నిందితుడిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ బుల్లెట్ల వర్షం కురిపించాడు. అప్పటికే పొజీషన్‌లో ఉండడంతో గురితప్పకుండా కాల్చిపడేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యం రికార్డు అయ్యింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ జరిపిన దాడిలో నిందితుడి పక్కనే ఉన్న మరో వ్యక్తి కూడా చనిపోయాడు. అంతేకాదు నిందితుడు కుప్పకూలిన సెకన్లలోనే మరో ఇద్దరు సీక్రెట్ ఏజెంట్స్ అతడికి వద్దకు చేరుకొని తుపాకీలు గురిపెట్టడం విశేషం.
మరోవైపు డొనాల్డ్ ట్రంప్ కుడి చెవికి బుల్లెట్ గాయమైంది. సమీపంలో ఉండి ఇది గమనించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ తక్షణమే ఆయనకు రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. అమాంతం వచ్చి ట్రంప్‌కు అడ్డుగోడగా తమ శరీరాలను అడ్డుపెట్టారు. సురక్షితంగా అక్కడి నుంచి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఈ మేరకు ట్రంప్ కూడా సీక్రెట్ ఏజెంట్స్ కు ధన్యవాదాలు తెలిపారు. సీక్రెట్ ఏజెంట్స్ రక్షించారంటూ ‘ట్రూత్ సోషల్ సైట్’ వేదికగా వెల్లడించారు.